దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ దూకుడు - sensex rallies 834pts to close at 49398
close

Published : 19/01/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ దూకుడు

800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌

14,500పైన నిఫ్టీ 

ముంబయి: బుల్‌ రంకేసింది.. ఉత్సాహంతో పరుగులు తీసింది. ఫలితంగా దలాల్‌స్ట్రీట్‌ కళకళలాడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 800 పాయింట్లకు పైగా ఎగబాకి మళ్లీ 49వేల మార్క్‌ దాటగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 14,400 మార్క్‌ దాటింది. 

రెండు సెషన్ల భారీ నష్టాల నుంచి పుంజుకున్న మార్కెట్లు ఈ ఉదయం బలంగా ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ కాసేపటికే భారీ లాభాల దిశగా పరుగులు తీసింది. దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో అంతకంతకూ ఎగబాకింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివరకు 834.02 పాయింట్లు లాభపడి 49,398.29 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 239.90పాయింట్ల లాభంతో 14,521.20 వద్ద ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 1.5 నుంచి 2.3శాతం పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌,  టాటామోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో షేర్లు రాణించాయి. టెక్‌ మహీంద్రా, ఐటీసీ, విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బ్రిటానియా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే..

* చైనా వృద్ధిరేటు మెరుగుపడటం ప్రాంతీయంగా కలిసొచ్చే అవకాశం ఉందన్న సంకేతాలతో అసియా మార్కెట్లు దూసుకెళ్లాయి. 

* రాబోయే అమెరికా ప్రభుత్వం భారీ ఉద్దీపనలు ప్రకటించనున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. 

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ లాంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల జోరును మరింత పెంచాయి. 

* కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు కూడా మదుపర్లలో ఆశలు రేకెత్తించాయి. ఫలితంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడి సూచీలు భారీ లాభాలను దక్కించుకున్నాయి.

ఇవీ చదవండి..

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..?

9% వ‌డ్డీకే `ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌` క్రెడిట్ కార్డ్ న‌గ‌దు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని