ట‌ర్మ్ బీమా పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి? - term-insurance-is-an-incredibly-important-investment
close

Published : 26/12/2020 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట‌ర్మ్ బీమా పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి?

దేశంలో బీమా పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. అయితే ఈ పెట్టుడులు ప్ర‌తీ ఒక్క‌రికీ అవ‌స‌ర‌మైన‌వే. వీటిని పెట్టుబ‌డుల్లా కాకుండా మీరు నిర్వ‌ర్తించే బాధ్య‌తల్లో దీన్ని ఒక‌దానిగా చేర్చుకోవాలి. మీ త‌ర్వాత కూడా కుటుంబానికి మీరున్నార‌నే భ‌రోసా ఇవ్వాలంటే ట‌ర్మ్ బీమా పాల‌సీ తీసుకోవాల్సిందే. కుటుంబం ఆర్థికంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అంత‌కంటే సంతోషం ఇంకేం ఉంటుంది.

పూర్తి జీవితానికి ఒకే పాల‌సీ:

ట‌ర్మ్ బీమా పాల‌సీ ఒక‌సారి కొనుగోలు చేస్తే పూర్తి జీవితానికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదైరైన‌ప్ప‌టికీ మీ ఆర్థిక జీవ‌నానికి ఆటంకం రాదు. అయితే ట‌ర్మ్ బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అన్నీ పాల‌సీలు ఒకేలా ఉండ‌వు, ఒకేలా హామీనివ్వ‌వు. అందుకే పాల‌సీ తీసుకునేముందు దానిపై అవ‌గాహ‌న పెంచుకోవ‌డం మంచిది.

  1. మ‌ర‌ణం

పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే ట‌ర్మ్ బీమా హామీ నామినీకి అందుతుంది. పాల‌సీ కాల‌ప‌రిమితి మెచ్యూరిటీ ముగియ‌క‌ముందు మ‌ర‌ణిస్తేనే హామీ ల‌భిస్తుంది. చాలామంది ట‌ర్మ్ బీమా పాల‌సీ కొనుగోలు చేయ‌డం పెట్టుబ‌డికంటే ఖ‌ర్చుగానే చూస్తారు. అయితే అవి, అనుకోకుండా వ‌చ్చే ప్ర‌మాదాలు జీవితాల‌ను అత‌లాకుతం చేయ‌కుండా కుటుంబాన్ని సంర‌క్షిస్తాయ‌నే విష‌యాన్ని మ‌ర్చిపోతారు.

ట‌ర్మ్ బీమా ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే వ‌చ్చే మొత్తం హామీపై కూడా ప‌న్ను ఉండ‌దు. కుటుంబం మొత్తాన్ని ఒక‌రే త‌మ సంపాద‌నతో పోషిస్తున్న‌వారైతే ట‌ర్మ్‌బీమా త‌ప్ప‌నిస‌రి. మీ త‌ర్వాత కూడా కుటుంబం ఆర్థిక ఆటంకాలు లేకుండా సాఫీగా జీవ‌నం కొన‌సాగించాలంటే కుటుంబ య‌జ‌మాని ఈ బాధ్య‌త తీసుకోవాల్సిందే. ట‌ర్మ్ ప్లాన్లు మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత క‌చ్చిత‌మైన హామీని అందిస్తాయి. హోల్ లైఫ్ ట‌ర్మ్ ప్లాన్‌లు, సాధార‌ణ ట‌ర్మ్ ప్లాన్‌ల కంటే ఖ‌ర్చుతో కూడుకున్న‌వి అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నాలు అందుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు 30 ఏళ్ల వ‌య‌సులో కోటీ రూపాయ‌ల‌ ట‌ర్మ్ ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియం రూ.650 నుంచి రూ.850 వ‌ర‌కు ఉంటుంది. అదే హోల్ లైఫ్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీలో అయితే రూ.1200 నుంచి రూ.6,500 వ‌ర‌కు ఉంటుంది.

  1. వ్యాధులు

మార్కెట్‌లో చాలా ర‌కాల ట‌ర్మ్ బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మో క్షుణ్ణంగా ప‌రిశీలించి తీసుకోవాలి. క్యాన్స‌ర్, హృద్రోగ వ్యాధులు లేదా ఆర్గాన్స్ దెబ్బ‌తిన్ప‌ప్పుడు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో చూడాలి. ట‌ర్మ్ బీమా పాలసీ తీసుకున్న‌ప్పుడు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ బెనిఫిట్ త‌ప్ప‌కుండా ఉండాలి. ఈ ప్లాన్‌లు క‌చ్చిత ప్ర‌యోజ‌నాల‌తో ఒకేసారి పూర్తి డ‌బ్బును చెల్లిస్తాయి. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను రెండు ర‌కాలుగా కొనుగోలుఉ చేయ‌వ‌చ్చు. ఒక‌టి ట‌ర్మ్ ప్లాన్‌తో రైడ‌ర్‌ను తీసుకోవ‌చ్చు. రెండ‌వ‌ది, ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీలు ప్ర‌త్యేకంగా అందించే స్టాండ‌లోన్ ప్లాన్‌ను కూడా తీసుకోవ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌కు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ ఫ్యూచ‌ర్ జ‌న‌ర‌లీ నుంచి తీసుకుంటే స్టాండ‌లోన్ ప్రోడ‌క్ట్ కూడా కొనుగోలు చేయాలి. ఇవి 59 శాతం చికిత్సా ఖ‌ర్చుల‌కు క‌వ‌రేజ్ ఇస్తుంది. మ్యాక్స్ లైఫ్ వ‌న్‌టైమ్ పేమెంట్ ఆఫ‌ర్‌తో 40 శాతం క‌వ‌రేజ్ అందిస్తుంది.

  1. వైక‌ల్యం

ట‌ర్మ్ బీమా పాల‌సీ అంటే పాల‌సీదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత హామీనిచ్చేందుకే అనుకుంటారు. కానీ అనుకోకుండా ఏదైనా ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు, తీవ్రంగా గాయ‌ప‌డిన‌ప్పుడు వైక‌ల్యం ఏర్ప‌డితే అది మ‌ర‌ణం కంటే ఎక్కువ‌గా బాధ‌ని క‌లిగిస్తుంది. ఆ స‌మ‌యంలో డ‌బ్బు అంత ఖ‌ర్చు కాకుండా ఉండేదుకు ఇది సాయ‌ప‌డుతుంది.

ఆదాయం ఆగిపోయిన స‌మ‌యంలో ప్ర‌త్యేక రైడ‌ర్లతో ఈ స‌మ‌యంలో ఖ‌ర్చును త‌గ్గించే అవ‌కాశం ఉంది. రైడ‌ర్ మీకు కాల‌ప‌రిమితి వ‌ర‌కు నెల‌వారి ఆదాయం లేక‌పోతే మొత్తం ఒకేసారి అదిస్తుంది. పూర్తిగా వైక‌ల్యం సంభ‌విస్తే మొత్తం హామీ ఒకేసారి ల‌భిస్తుంది. పాక్షికంగా దెబ్బ‌తింటే కొంత మొత్తం అందిస్తారు. బీమా సంస్థ‌ల ప్లాన్‌లు కూడా అన్ని ఒకే ర‌కంగా ఉండ‌వు.

ఉదాహ‌ర‌ణ‌కు 30 ఏళ్ల వ‌య‌సులో ఏజియాన్ లైఫ్ ఐట‌ర్మ్ ప్లాన్ హామీ మొత్తం రూ.55 ల‌క్ష‌లు కాగా, ఒకేసారి రూ.25 లక్ష‌లు…మిగ‌తాది 8 సంవ‌త్స‌రాలకు ఏడాది రూ.8 వేల నుంచి రూ.9 వేల వ‌ర‌కు అందిస్తుంది. అదేవిధంగా పీఎన్‌బీ మెట్ లైప్ మేరా ట‌ర్మ్ ప్లాన్ రూ.61 ల‌క్ష‌లు ఒకేసారి అందిస్తుంది. దీని ప్రీమియం సంవత్సరానికి రూ.12 వేల వ‌ర‌కు ఉంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని