ఏక మొత్తం.. సిప్‌.. ఏది మేలు? - which strategy is better to invest
close

Published : 02/04/2021 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏక మొత్తం.. సిప్‌.. ఏది మేలు?

స్టాక్‌ మార్కెట్‌లో తొలిసారి మదుపు చేస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఎంతోమంది షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామందికి నా దగ్గరున్న మొత్తం డబ్బును ఒకేసారి మదుపు చేయాలా? లేకపోతే.. క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (సిప్‌) ఎంచుకోవాలా? అనే సందేహం వస్తోంది. వాస్తవానికి ఈ రెండూ పద్ధతులు వేటికవే ప్రత్యేకం.. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఏ అంశాలను పరిశీలించాలనేది చూద్దాం..
ఒకేసారి మదుపు చేస్తుంటే..
నెలనెలా మదుపు చేసేందుకు డబ్బు అందుబాటులో ఉండని, ఆదాయంలో అనిశ్చితి ఉన్నవారు.. ఒకేసారి తమ వద్ద ఉన్న పెద్ద మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించవచ్చు. ఒకేసారి మదుపు చేస్తున్నారు కాబట్టి, పెద్ద మొత్తంలో ఉన్నప్పుడే.. దీర్ఘకాలంలో మార్కెట్‌ అందించే లాభాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ పెట్టుబడి నష్టం వచ్చినా తట్టుకునే వారికే సరిపోతుంది. మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సూచీలు తక్కువ స్థాయుల్లో కొనసాగుతున్నప్పుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుబాటులో ఉన్నవారికే ఇది సరిపోతుంది. అందులోనూ.. అందుబాటులో ఉన్నప్పుడల్లా.. పెద్ద మొత్తం మదుపు చేస్తూ.. సగటును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. 
క్రమానుగతంగా..
క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించే వారికి నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానమే (సిప్‌) మేలు. కనీసం రూ.500 నుంచి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా మదుపు చేసుకోవచ్చు. ఇప్పుడు రోజువారీ, వారం, నెల, మూడు నెలల సిప్‌లూ అందుబాటులో ఉన్నాయి. ఎంత కాలం పాటు మదుపును కొనసాగించాలని నిర్ణయించుకొని, ఆ మేరకు ఫండ్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంటే చాలు.. నెలనెలా నిర్ణీత తేదీనాడు ఆ డబ్బు మ్యూచువల్‌ ఫండ్లలోకి వెళ్లిపోతుంది. దీర్ఘకాలంపాటు ఫండ్లలో సిప్‌ చేయడం ద్వారా మార్కెట్లో సగటు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పుడిప్పుడే ఉద్యోగం ప్రారంభించిన వారు.. దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నవారికి ఇది ఎంతో అనుకూలం.

 - జ్యోతి రాయ్, డీవీపీ, ఈక్విటీ స్ట్రాటజిస్ట్, ఏంజెల్‌ బ్రోకింగ్‌ 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని