close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (30/01/2020)

1. డిస్‌ప్లే కింద కెమెరా

నోకియా నుంచి వచ్చే ఫోన్లలో 9 సిరీస్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. పెంటా లెన్స్‌ కెమెరా అంటూ గతేడాది వచ్చిన మొబైల్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది ఆ సిరీస్‌లో 9.2 తీసుకొస్తున్నారు. ఇందులోనూ నోకియా అద్భుతం చూపించబోతోందని సమాచారం. ముందువైపు అండర్‌ డిస్‌ప్లే కెమెరా తీసుకొస్తారట. అంటే ఫుల్‌ స్క్రీన్‌ వచ్చి.. దాని దిగువ కెమెరా ఉంటుంది. కెమెరా యాప్‌ ఓపెన్‌ చేస్తే స్క్రీన్‌ మీద నిర్ణీత ప్రదేశంలో కెమెరా యాక్సెస్‌ అవుతుంది. వెనుకవైపు పెంటా లెన్స్‌ కొనసాగిస్తారట. 

2. హువావేలో ‘యూట్యూబ్‌’ ఉండదు

హువావే మొబైళ్లలో గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ ఉండవంటూ చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అయితే ఇంకా యాప్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిని తొలగించే విషయంలో హువావే ముందడుగు వేసింది. త్వరలో హువావే నుంచి రాబోతున్న పి40లో గూగుల్‌కు సంబంధించిన కోర్‌ యాప్స్‌ యూట్యూబ్‌, క్రోమ్‌ లాంటివి ఉండవు అని సంస్థ తెలిపింది. వీటికి బదులు ప్రత్యేకంగా హువావే యాప్స్‌ తయారు చేయిస్తోంది. దీని కోసం 150 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. 

3. మా ట్యాగ్‌లైన్‌ కాపీ కొట్టొద్దు

షావోమీ, రియల్‌మీ మధ్య ‘కాపీ’ యుద్ధం నడుస్తున్న సమయంలో మరో కాపీ అంశం తెరమీదకొచ్చింది. మా ట్యాగ్‌లైన్‌ను కాపీ కొట్టొద్దంటూ వన్‌ప్లస్‌కు చెందిన మాజీ అధికారి పోకోను కోరాడు.  పోకో త్వరలో లాంచ్‌ చేయబోతున్న ఎక్స్‌2 మొబైల్‌కు ‘స్మూత్‌ ఏఎఫ్‌’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. అయితే వన్‌ప్లస్‌ ‘ఫాస్ట్‌ ఏఎఫ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ వాడుతోంది. కాబట్టి మీరు ‘స్మూత్‌ ఏఎఫ్‌’ వాడొద్దని జైమన్‌ కొపెక్‌ అనే మాజీ వన్‌ప్లస్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ సూచించాడు. మరి పోకో టీమ్‌ ఏమంటుందో చూడాలి. 

4. ఛార్జింగ్‌ మ్యాట్‌.. 

యాపిల్‌ నుంచి ఈ ఏడాది కొత్త కొత్త ప్రోడక్ట్స్‌ రాబోతున్నాయి. వాటిలో ఛార్జింగ్‌ మ్యాట్‌, వైడ్‌ బ్యాండ్‌ ట్యాగ్స్‌ లాంటివి ఉన్నాయి. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కోసం ఓ మ్యాట్‌ను తీసుకొస్తున్నట్లు యాపిల్‌ కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. నిజానికి అది గతేడాదే రావాల్సి ఉంది.  కానీ, వాయిదా వేశారు. ఈ ఏడాది తీసుకొస్తారట. ఈ మ్యాట్‌ మీద ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ లాంటివి పెడితే ఛార్జింగ్‌ అవ్వడం దాని ప్రత్యేకత. తరచూ వస్తువులు మరచిపోయేవారి కోసం ఆన్‌లైన్‌లో కొన్ని ట్యాగ్స్‌ ఉంటాయి. వాటిని మీ వస్తువుల్లో పెట్టుకొని మొబైల్‌ యాప్‌లో ఫైండ్‌ కొడితే అవి శబ్దం చేస్తాయి. దాని వల్ల ఆ వస్తువు ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ తరహా ట్యాగ్‌ను యాపిల్‌ ఈ ఏడాది లాంచ్‌ చేయబోతోందని సమాచారం. 

5. బ్యాటరీ లైఫ్‌ 10 రోజులు...

‘రీడింగ్‌ స్మార్ట్‌ఫోన్‌’... ఏంటి ఇలాంటివి కూడా ఉంటాయనుకుంటున్నారా? ఉన్నాయి మరి. చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ హైసెన్స్‌ ఈ తరహా మొబైల్‌ను తీసుకొస్తోంది. సాధారణ మొబైల్‌ స్క్రీన్‌ మీకు రంగురంగుల్లో ఉంటుంది. కానీ హైసెన్స్‌ ఏ5 మొబైల్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌గా ఉండబోతోంది. అంటే అమెజాన్‌ కిండిల్‌ స్టైల్‌లో అందిస్తున్నారు. ఈ మార్పు వల్ల 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటున్న ఈ సమయంలో ఈ మొబైల్‌ రాణిస్తుందేమో చూడాలి.

6. మరీ ఇంత వేగమా...

షావోమీ నుంచి ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌లో మొబైళ్లు రాబోతున్న విషయం తెలిసిందే. ఎంఐ10 సిరీస్‌లో ఎంఐ 10, ఎంఐ10 ప్రో పేరుతో రెండు మోడళ్లు లాంచ్‌ చేయబోతున్నారు. ఈ మొబైల్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ మొబైళ్లు 66 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయని సమాచారం. ఈ మేరకు చైనాలో ఈ మొబైళ్ల సర్టిఫికేషన్‌ కూడా పూర్తయిందట. దీని ప్రకారం చూస్తే 4000 ఎంఏహెచ్‌ ఉన్న బ్యాటరీ 15-20 నిమిషాల్లోపు ఫుల్‌ ఛార్జింగ్‌ అవుతుంది. 

7. రెండు వారాల బ్యాటరీతో...

ప్రముఖ వాచీ తయారీ సంస్థ ఫాజిల్‌ నుంచి మన దేశంలో మరో హైబ్రిడ్‌ హెచ్‌ఆర్‌ స్మార్ట్‌వాచ్‌ విడుదలైంది. ఇందులో తొలిసారిగా ఆల్వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లేను తీసుకొస్తున్నారు. దీంతోపాటు హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌, రియల్‌ టైమ్‌ వెదర్‌, కాల్‌, టెక్స్ట్‌ ప్రివ్యూస్‌ లాంటి ఫీచర్లూ ఉన్నాయి. దీని ధర రూ.14,995. అమెజాన్‌లో అమ్మకానికి తీసుకొచ్చారు. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టుకుంటే రెండు వారాల బ్యాటరీ లైఫ్‌ వస్తుందని ఫాజిల్‌ చెబుతోంది. ఫుల్ ఛార్జి అవ్వడానికి 50 నిమిషాల సమయం తీసుకుంటుందట. 

8. గూగుల్‌ ‘టిక్‌టాక్‌’

షార్ట్‌ అండ్‌ వైరల్‌ వీడియోలతో యువత మనసు దోచుకున్న టిక్‌టాక్‌కు పోటీగా గూగుల్‌ ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ‘టాంగీ’ పేరుతో రూపొందిన ఈ యాప్‌ ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులోకి వచ్చింది.  త్వరలో ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారు. ఈ యాప్‌తో గరిష్ఠంగా 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను రూపొందించి షేర్‌ చేయొచ్చు. అయితే ఈ యాప్‌ ప్రస్తుతానికి ఐఓఎస్‌కు మాత్రమే తీసుకొచ్చారు. త్వరలో ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ వస్తుందట.

9. ‘డౌట్‌’ వస్తే చెప్పేయండి

వాట్సాప్‌లో షేర్‌ అయ్యే మెసేజ్‌లు, ఫొటోల్లో ఫేక్‌వే ఎక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయిన కరోనా వైరస్‌ గురించి వాట్సాప్‌లో చాలా ఫేక్‌ మెసేజ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా ‘ఫ్లాగ్‌’ ఆప్షన్‌ తీసుకొస్తే బాగుంటుందని వాట్సాప్‌కు పెన్సిల్వేనియా, లీడెన్‌ విశ్వవిద్యాలయం సూచించింది. అనుమానం ఉన్న మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే రెడ్‌ ఫ్లాగ్‌ వస్తుంది. అలా ఎక్కువ రెడ్‌ఫ్లాగ్స్‌ వస్తే ఆ మెసేజ్‌ను ఎవరూ నమ్మకుండా  ఉంటారు. మరి ఈ విషయంలో వాట్సాప్‌ ఏమంటుందో చూడాలి. 

10. యాపిల్‌ వాచ్‌కు దగ్గరగా...

స్మార్ట్‌ఫోన్‌ ఫోన్లతో దూసుకుపోతున్న ఒప్పొ నుంచి మరో స్మార్ట్‌ వాచ్‌ రాబోతోంది. గతేడాది జరిగిన ఇన్నో డే ఈవెంట్‌ ఈ మేరకు ఒప్పొ ప్రకటించింది. అయితే విడుదల తేదీ విషయంలో ఇప్పుడు కాస్త స్పష్టతనిచ్చింది. రెనో 3, రెనో3 ప్రో5జీతో పాటు స్మార్ట్‌ వాచీని కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సంస్థ వీబో అకౌంట్‌లో షేర్‌ చేశారు. డిజైన్‌ పరంగా చూస్తే యాపిల్‌ వాచ్‌కు దగ్గరగా ఉంది. 

 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.