పంత్‌ గిల్‌క్రిస్ట్‌ లాంటోడు: చోప్రా - Aakash Chopra compares Rishabh Pant with former Australia batsman and wicket keeper Adam Gilchrist
close
Published : 13/12/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ గిల్‌క్రిస్ట్‌ లాంటోడు: చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి ఫామ్‌ అందుకోవడంపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. పంత్‌.. ఆస్ట్రేలియా మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ లాంటోడని ప్రశంసించాడు. సిడ్నీ వేదికగా టీమ్‌ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎ జట్టుతో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఆపై కంగారూలు 108 పరుగులు చేశారు. ఇక శనివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడగా పృథ్వీషా(3) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ అందుకున్నారు. 

హనుమ విహారి(104; 194 బంతుల్లో 13x4), రిషభ్‌పంత్‌(103; 73 బంతుల్లో 9x4, 6x6) శతకాలతో మెరవగా, మయాంక్‌ అగర్వాల్‌(61; 120బంతుల్లో 4x4, 2x6), శుభ్‌మన్‌గిల్‌ (65; 78 బంతుల్లో 10x4) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్‌ 386/4 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మ్యాచ్‌ అనంతరం భారత ప్రదర్శనపై విశ్లేషించిన ఆకాశ్‌చోప్రా.. బ్యాట్స్‌మెన్‌ అంతా రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు. తొలుత మయాంక్‌ అగర్వాల్‌పై స్పందిస్తూ.. అతడు ఆస్ట్రేలియాలోనే కెరీర్‌ ఆరంభించాడని, కీలక సమయంలో పరుగులు చేసినందుకు అభినందించాలన్నాడు. ఈ అర్ధశతకంతో అతడు తిరిగి ఫామ్‌ అందుకున్నాడని, అయితే.. ఇంకా పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ శతకం బాదకపోయినా ఫర్వాలేదని,టెస్టు మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు సాధించాలని చోప్రా ఆకాంక్షించాడు. 

ఇక రిషభ్‌పంత్‌పై స్పందించిన మాజీ క్రికెటర్‌.. ఆట చివర్లో అతడు అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మెరుపు శతకం బాదాడన్నాడు. పంత్‌ క్రీజులోకి వచ్చేసరికే హనుమ విహారి చాలా ముందున్నాడని, అలాంటిది మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి ఇద్దరూ శతకాలు సాధించారని చెప్పాడు. ఈ ఆటలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా తాను మొదట విహారిని అనుకున్నానని, అయితే.. పంత్‌ తన ఆటతో ఆ అభిప్రాయాన్ని మార్చాడన్నాడు. అతడు ఆడం గిల్‌క్రిస్ట్‌లాంటోడని కితాబిచ్చాడు. ఆసీస్‌ మాజీ గొప్ప ఆటగాడని, పంత్‌ బ్యాటింగ్‌ చూస్తే అతడే గుర్తొస్తాడన్నాడు. ఒక్క సెషన్‌లో పంత్‌ ఆట స్వరూపాన్ని మార్చేస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇవీ చదవండి..

ఎన్నాళ్ల కెన్నాళ్లకు.. యువరాజ్‌ సిక్సర్‌!

నీ ప్రయాణం అజరామరం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని