డ్రగ్స్‌ కేసు.. పోలీస్‌ కస్టడీకి  నటి సంజన - Actress Sanjana taken into police custody for 5 days
close
Published : 08/09/2020 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసు.. పోలీస్‌ కస్టడీకి  నటి సంజన

బెంగళూరు: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన కన్నడ సినీ తార సంజనా గల్రానీకి కోర్టు ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఈ రోజు ఆమెను అరెస్టు చేసిన వెంటనే  సీసీబీ పోలీసులు ఆమెను కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి ఆమెను ఐదు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు సంజనను బెంగళూరులోని కేసీ జనరల్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలతో పాటు కొవిడ్‌ టెస్ట్‌ చేయించారు. ఆమెకు కరోనా నెగటివ్‌గా తేలడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరినప్పటికీ.. న్యాయస్థానం ఐదు రోజులకే అనుమతిచ్చింది. 

వైద్య పరీక్షలకు తీసుకెళ్లే ముందు కూడా సంజనను దాదాపు మూడు గంటల పాటు అధికారులు విచారించగా.. ఆమె అంతగా సహకరించలేదని సమాచారం. డ్రగ్స్‌ కేసులో నిందితులుగా ఉన్న రాహుల్‌, వీరెన్‌ ఖన్నా తదితరులతో తనకు ఉన్న స్నేహంపై అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 14వ నిందితురాలిగా ఉన్న సంజనా గల్రానీ.. ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న కొందరు డ్రగ్స్‌ వాడినట్టు చెప్పినట్టు సమాచారం. వీటికి సంబంధించిన ఆధారాలు లభ్యమైతే వారికి కూడా నోటీసులు పంపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

సంజనను కూడా రాగిణి ద్వివేది ఉంటున్న  స్టేట్‌ ఉమెన్స్‌ హోంలోనే ఉంచనున్నారు. వారిద్దరూ కలిసే అవకాశం లేకుండా సంజనకు ప్రత్యేక గది కేటాయించి అక్కడ మరింత మంది మహిళా పోలీసులను భద్రతగా మోహరించనున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని