జమ్మూలో భాజపా.. కశ్మీర్‌లో గుప్కార్‌ - Counting of votes for 280 DDC seats in JK continues
close
Updated : 22/12/2020 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జమ్మూలో భాజపా.. కశ్మీర్‌లో గుప్కార్‌

జమ్మూ-కశ్మీర్‌లో కొనసాగుతున్న డీడీసీ ఎన్నికల కౌంటింగ్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ)​ఎన్నికల ఫలితాల్లో భాజపా-గుప్కార్‌ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. జమ్మూలో ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం దిశగా సాగుతోంది. కశ్మీర్‌కు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గుప్కార్ ​కూటమికి భాజపాకు మధ్య జమ్మూ ప్రాంతంలో భారీ వ్యత్యాసం కనపడుతోంది. అయితే, కశ్మీర్‌లో మాత్రం ఎక్కువ స్థానాల్లో గుప్కార్​ కూటమి ముందంజలో ఉంది. కానీ, స్థానిక భాజపా నాయకులు మాట్లాడుతూ.. తమ పార్టీకి గప్కార్‌ అలయెన్స్‌కు మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉందని తెలిపారు.

నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు మొత్తం 8 విడతల్లో జరిగిన డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తం 20 జిల్లాల్లో 280 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికరణ 370 రద్దు మొదలు జమ్మూ-కశ్మీర్‌లో ​పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 2019, ఆగస్టు 5న ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించారు. జమ్మూ-కశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలోని 73వ సవరణను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఫలితంగా జమ్మూ-కశ్మీర్​లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.

మరోవైపు పాకిస్థాన్‌ దళాలు తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నాయి. నేడు ఉదయం నియంత్రణా రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడ్డాయి. పూంచ్‌ జిల్లాలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్లతో దాడి చేస్తోంది. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నట్లు సైనికాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్..!

వామ్మో కొత్త కరోనా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని