శానిటైజర్లను అతిగా వాడుతున్నారా? - Excess Usage Of Sanitizers And Health Hazards
close
Published : 24/10/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శానిటైజర్లను అతిగా వాడుతున్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్ ‌: కరోనా మహమ్మారి పీడిస్తున్న కల్లోల కాలమిది. వైరస్‌ సోకుతుందన్న అనుమానంతో దేన్ని ముట్టుకోవాలన్నా కొంతమంది భయపడిపోతుంటారు. చేతులను అతిగా శుభ్రం చేస్తుంటారు. అందుకోసం విరివిగా శానిటైజర్లు వాడుతుంటారు. అయితే ఏదైనా అతిగా చేస్తే నష్టమే అన్న సూత్రం వీటి వాడకానికీ వర్తిస్తుందంటున్నారు డాక్టర్లు. సబ్బులు, శానిటైజర్లు, ఇంటినీ, టాయ్‌లెట్లను శుభ్రపరచటానికి ఉపయోగించే రసాయనాలను అతిగా వాడటం వల్ల సమస్యలు వచ్చి పడతాయంటున్నారు. వీటిని అతిగా వాడితే చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ లుక్కేయండి.

 

అతిగా వాడితే నష్టమే..!
కరోనా వైరస్‌ సోకకుండా ఉండటం కోసం శానిటైజర్లు వాడటం అవసరమే. అయితే..అతిగా వాడటం వల్ల నష్టం జరుగుతుంది. శానిటైజర్‌ను తరచుగా వాడినపుడు..చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇందులోని ఆల్కహాల్‌తో పాటు ఉండే అనేక రసాయనాలు చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా  తేలికగా చర్మంలోకి చేరుతుంది. శానిటైజర్లోని ఆల్కహాల్‌లో ఉండే ఐసోప్రొపనాలియన్‌ వంటివి చేతుల్లోని కణాలకు హాని కలిగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్‌ ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా శానిటైజర్లలో ఉపయోగించే రసాయనాల పరిమళాలు కొందరికి అలర్జీ కలిగేలా చేస్తాయి.

హార్మోన్ల అసమతుల్యతకూ దారితీయొచ్చు...
శానిటైజర్ల వాడకం అతిగా ఉంటే సాధారణంగా చర్మంపై దురద, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.  కొందరిలో హార్మోన్ల అసమతుల్యతకూ కారణమవుతాయి. శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసామ్‌ అనే రసాయనం యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్‌లను తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతుంది. దాంతో తేలికగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. 

 

ముఖానికి శానిటైజర్‌ రాయొద్దు..
కొంతమంది ముఖం, మోచేతులకు కూడా శానిటైజర్‌ రాసుకుంటారు. శానిటైజర్లలో 60 నుంచి 70 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అందువల్ల  చేతులు శుభ్రం చేసుకోవటానికి మాత్రమే ఉపయోగించాలి. ఉపరితలాలను శుభ్రపరిచే డిస్‌ఇన్ఫెక్టెంట్‌లతోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇవి నేరుగా తాకితే చర్మం, కళ్లు ఎర్రగా మారతాయి. కొన్ని డిస్‌ఇన్ఫెక్టెంట్‌ల్లోని రసాయనాలు కాలేయం, గుండె, శ్వాస వ్యవస్థలకు హానిచేస్తాయి. ఈ రసాయనాలతో తలనొప్పి, వాంతి వంటి సమస్యలూ తలెత్తుతాయి. అందువల్ల వీటన్నింటినీ పరిమితంగానే వాడాలి. డిస్‌ఇన్ఫెక్టెంట్‌లను వాడే సమయంలో తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. కళ్లకు గాగుల్స్‌ పెట్టుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని