మెరిసిన విలియమ్సన్‌..దిల్లీ లక్ష్యం 163 - Hyderabad sets good target for Delhi
close
Updated : 29/09/2020 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరిసిన విలియమ్సన్‌..దిల్లీ లక్ష్యం 163

అర్ధ శతకంతో ఆకట్టుకున్న జానీ బెయిర్‌ స్టో

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా దిల్లీతో జరుగుతున్న మూడో టీ20లో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(45; 33 బంతుల్లో 3x4, 2x6), జానీ బెయిర్‌స్టో(54; 48 బంతుల్లో 2x4, 1x6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకం దిశగా వెళ్తున్న వార్నర్..‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్‌ పాండే(3) నిరాశపరిచాడు. అతడు కూడా మిశ్రా బౌలింగ్‌లోనే రబాడ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన కేన్‌ విలియ్సమన్‌(41; 26 బంతుల్లో 5x4) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో బెయిర్‌ స్టోతో కలిసి ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, రబాడ వేసిన 18వ ఓవర్‌ ఐదో బంతికి అనూహ్య షాట్‌ ఆడిన బెయిర్‌స్టో.. నోర్జే చేతికి చిక్కాడు. దీంతో వార్నర్‌ టీమ్‌ 144/3తో నిలిచింది. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌(12; 7బంతుల్లో 1x4, 1x6) వీలైనన్ని పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో విలియమ్సన్‌ భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. ఈ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే రావడంతో హైదరాబాద్‌ స్కోర్‌ 162కే పరిమితమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని