‘సోనూసూద్‌’పై పుస్తకం.. పేరేంటో తెలుసా..? - I am no Messaiah book on Sonu sood lifestory
close
Published : 13/11/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సోనూసూద్‌’పై పుస్తకం.. పేరేంటో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రీల్‌లైఫ్‌ విలన్‌.. రియల్‌ లైఫ్‌ హీరో సోనూసూద్‌. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలైపోతే.. జనమంతా ప్రాణాలు చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కానీ.. సోనూసూద్‌ మాత్రం అభాగ్యులను ఆదుకోవడానికి నడుంకట్టాడు. వేలాదిమందిని ఆదుకున్నాడు. ప్రజల గుండెల్లో అసలైన హీరోగా ముద్ర వేసుకున్నాడు. లాక్‌డౌన్‌లో తన అనుభవాలను ప్రంపచానికి చెప్పేందుకు ఒక పుస్తకం రాస్తానని సోనూ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా మీనా అయ్యర్ అనే జర్నలిస్టుతో కలిసి ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. ‘ఐయామ్‌ నో మెస్సయ్య’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సహకరించిన జర్నలిస్టు మీనా అయ్యర్‌, ‘పెంగ్విన్ ఇండియా’కు సోనూసూద్‌ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ.. ‘ప్రజలు నా విషయంలో చాలా దయతో ఉన్నారు. నేనూ సాధారణమైన మనిషినే. నాకు తోచిన సాయం నేను చేశానంతే. మనుషులుగా సాటివారికి సాయం చేయడం మన బాధ్యత’ అని సోనూసూద్‌ అన్నారు. ‘ఈ పుస్తకం డిసెంబర్‌లో అందరికీ అందుబాటులోకి వస్తోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది నా జీవిత చరిత్ర.. అంటే వేలాదిమంది వలస కార్మికుల కథ’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు సోనూసూద్‌ తన సొంతఖర్చుతో విమానాలు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఉద్యోగాలు కోల్పోయినవారికి ఉద్యోగాలు.. ఆర్థికంగా నష్టపోయినవారికి ఆర్థికసాయం చేశాడు. సోనూసూద్‌ నుంచి సాయం పొందినవారు కొంతమంది తమ ఇళ్లలో ఆయన ఫొటోలు తగిలించుకున్నారు. మరికొంతమంది గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని