తమిళనాట  లంచం ‘రేటు కార్డు’ ఇదీ: కమల్‌  - Kamal Haasan releases rate card of bribery in TN
close
Published : 29/12/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాట  లంచం ‘రేటు కార్డు’ ఇదీ: కమల్‌ 

చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై మక్కల్‌ నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు 17 సేవలకు ప్రజల నుంచి లంచాలు వసూళ్లు చేయడంపై అన్నాడీంఎకే ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరూ లంచం చెల్లించాల్సి వస్తోందని, లంచాలు తీసుకున్న తర్వాతే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘బ్రైబ్ రేట్‌ కార్డు’ను మీడియాకు విడుదల చేశారు. ఈ కార్డులో ఆయా ప్రభుత్వ సర్వీసులకు ప్రభుత్వ కార్యాలయాల్లో డిమాండ్‌ చేసే మొత్తాల జాబితాను పేర్కొన్నారు. ఈ జాబితాను ఎవరైనా తిరస్కరించగలరా? అని ప్రశ్నించారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు కమల్‌ వెల్లడించారు. తమ పార్టీకి మహిళల నుంచి ఎక్కువ మద్దతు వస్తుండటం సంతోషదాయకమన్నారు. ఎంఎన్‌ఎం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రంలో పాలనను డిజిటలైజ్‌ చేస్తామని, కాగిత రహిత పాలకు కృషిచేస్తామని తెలిపారు.  ఇదివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల అంశంపై డీఎంకే నేత స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు మీరూ కలుస్తారా? అని ప్రశ్నించగా.. ప్రజలే గవర్నర్‌ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్తారన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ముందుచూపు కలిగిన పాలనతోనే ఇలాంటి పరిస్థితులు మారుతాయన్నారు.

ఇదీ చదవండి..

అలా చేయని పక్షంలో అసెంబ్లీ ముట్టడి: పవన్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని