అందుకే ‘బొమ్మరిల్లు’ చేయలేకపోయిన ఎన్టీఆర్‌ - NTR feels bad About not doing Bommarillu movie
close
Published : 04/08/2020 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘బొమ్మరిల్లు’ చేయలేకపోయిన ఎన్టీఆర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బొమ్మరిల్లు’. 2006లో విడుదలైన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతంతో పాటు, సిద్ధార్థ్‌, జెనీలియా, ప్రకాశ్‌రాజ్‌ల నటన హైలైట్‌గా నిలిచింది. అయితే తొలుత చిత్రం ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చింది. కానీ, ఒక కారణం వల్ల తాను ఈ సినిమా చేయలేకపోయానని వాపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘ఒకసారి దిల్‌రాజ్‌ వచ్చి ‘బొమ్మరిల్లు’ స్టోరీ చెప్పారు. స్క్రిప్ట్‌ బాగా నచ్చింది. అయితే, నాకున్న ఇమేజ్‌ కారణంగా ఆ సినిమా చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డా. అయ్యో మంచి స్క్రిప్ట్‌ పోతోందే అని ఎన్నోసార్లు ఆలోచించా. నా ఇమేజ్‌ ఆ సినిమాకు న్యాయం చేయలేదు. ఎన్టీఆర్‌ సినిమా అంటే డ్యాన్స్‌లు, ఫైట్‌లు, కామెడీ, హీరోయిజం, పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఉంటాయనుకొని నా అభిమానులు ఆశిస్తారు. అవేవీ లేకుండా సినిమా చేస్తే, నేను ఆ సినిమాకు మోసం చేసినవాడిని అవుతాను’’ అని చెప్పుకొచ్చారు.

అయితే ‘బృందావనం’లో బ్రహ్మానందం ‘బొమ్మరిల్లు’ ఫాదర్‌ క్యారెక్టర్‌ అని చెబుతూ ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించడానికి వస్తాడు. బ్రహ్మానందం అంటే భయపడిపోయే వ్యక్తిగా ఎన్టీఆర్‌ నవ్వులు పూయిస్తారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని