ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులో ఉండాలి - Pawan Kalyan talking about Importance telugu Language
close
Published : 29/08/2020 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులో ఉండాలి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్రంలోని చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగుకు నివాళులర్పించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగుకు నిజమైన నివాళి అన్నారు. 

మాతృభాష తీయదనం భావితరాలకు అందించేందుకే ‘మన నుడి- మన నది’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వం వాడే భాష ప్రజలందరికీ  అర్థమయ్యేలా సరళంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా నిత్య వ్యవహారాల్లో తెలుగుభాషకు పట్టం కట్టాలని ఈ సందర్భంగా పవన్‌ కోరారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని