కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక - Priyanka Chopra pushes Nick Jonas out of car during tense argument in London
close
Published : 16/12/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక

లండన్‌ వీధుల్లో గొడవపడిన జంట

ముంబయి: ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక ‘క్వాంటికో’ సిరీస్‌తో హాలీవుడ్‌లో సైతం మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో అటు బాలీవుడ్‌, ఇటు హాలీవుడ్‌లోనూ కథానాయికగా రాణిస్తున్నారు. హాలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న తరుణంలోనే తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌జొనాస్‌తో ప్రియాంకకు పరిచయం ఏర్పడడం.. ప్రేమ.. అనంతరం పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2018లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

కాగా, తన భర్త నిక్‌పై ఎంతో ప్రేమతో ఉండే ప్రియాంక ఉన్నట్లుండి తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో లండన్‌ వీధుల్లో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, ఇందులో చిన్న ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే.. ప్రియాంక-నిక్‌ గొడవపడింది రియల్‌ లైఫ్‌లో కాదు రీల్‌ లైఫ్‌లో. ప్రస్తుతం ప్రియాంక తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘టెక్ట్స్‌ ఫర్‌ యూ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నిక్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించారు. ఇందులో భాగంగా కారులో ప్రయాణిస్తున్న ప్రియాంక-నిక్‌ గొడవపడడం.. అనంతరం నిక్‌ను తన కారు నుంచి దిగిపొమ్మని ఆమె గట్టిగా చెప్పడం.. ఇలా సీన్లు షూట్‌ చేశారు.

ఇవీ చదవండి

హృతిక్‌ ఇకనైనా ఏడుపు ఆపుతావా?: కంగన

ఆ ఇద్దరు గోవాకు ఎందుకెళ్లారు?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని