అక్టోబర్‌ 30న అన్నీ చెబుతా: పునర్నవి - Punarnavi posts engagement pic leaves everyone confused
close
Updated : 29/10/2020 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబర్‌ 30న అన్నీ చెబుతా: పునర్నవి

ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఫొటో షేర్‌ చేసిన నటి.. అభిమానులు షాక్‌

హైదరాబాద్‌: నటి పునర్నవి భూపాలం తాజాగా తన అభిమానుల్ని షాక్‌కు గురి చేశారు. బుధవారం రాత్రి ఆమె పెట్టిన ఓ పోస్ట్‌తో నెటిజన్లు గందరగోళానికి గురి అవుతున్నారు. విభిన్నమైన నటన, చలాకీతనంతో పునర్నవి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తన బ్యూటీ, ఫిట్‌నెస్‌, స్టైల్‌కు సంబంధించిన పోస్టులతో తరచూ ఇన్‌స్టా వేదికగా ఆమె ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె.. తన చేతికి ఉన్న రింగ్‌ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

ఆమె పెట్టిన పోస్ట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కొందరు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పగా.. మరికొందరు మాత్రం ‘నిజమేనా, మేడమ్‌.. ఇది నిజంగా ఎంగేజ్‌మెంట్‌ రింగేనా?, వర్క్‌ ప్రమోషన్‌ చేస్తున్నారా?, ఇంతకీ ఎవరు మిమ్మల్ని పెళ్లాడబోయే వ్యక్తి?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పున్ను పెట్టిన పోస్ట్‌పై నిర్మలా వనమాలీ అనే మహిళ స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్‌!! ఈ ఫొటోలో మీ చేయి పట్టుకుంది ఓ అమ్మాయి అని నేను అనుకుంటుకున్నాను’ అని కామెంట్‌ పెట్టారు. ‘సైలెంట్‌గా ఉండు’ అనే ఎమోజీలతో పున్ను ఆమెకు రిప్లై ఇచ్చారు. మరో స్నేహితురాలు సాయి శ్వేతా..‘ఓ మై గాడ్‌.. నువ్వు నిజమే చెబుతున్నావా? ఎట్టకేలకు సీక్రెట్‌ బయటపెట్టావు. ఇంకొంచెం ఎక్కువ చెప్పు’ అని కామెంట్‌ పెట్టగా.. ‘అక్టోబర్‌ 30 వరకూ వేచి ఉండు’ అని పునర్నవి సమాధానమిచ్చారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పునర్నవి తెలుగు ప్రేక్షకులకు చేరువైన విషయం విధితమే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని