యాక్షన్‌ డ్రామాగా ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’ - Ramcharan Release Shoot Out At Aleru
close
Published : 22/12/2020 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్షన్‌ డ్రామాగా ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో ఓటీటీ వేదికలకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పలు సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇక వెబ్‌ సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో మరో యాక్షన్‌ డ్రామా సిరీస్‌ ‘జీ5’ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఆలేరు వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ నేపథ్యంగా ఆనంద్ రంగా దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’. మెగా డాటర్ సుస్మితా నిర్మించిన ఈ సిరీస్ డిసెంబర్ 25న జీ5లో విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో రామ్‌చరణ్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ షో రీల్‌ను గన్ పేల్చి విడుదల చేశారు. తన సోదరి నిర్మాతగా మారి తొలిసారి నిర్మించిన వెబ్ సిరీస్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు ఆనంద్ రంగాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చెర్రీ.... కొవిడ్ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ చిత్రంలో ఐజీ ప్రవీణ్ చంద్రగా శ్రీకాంత్, ఎస్పీ సూర్యనారాయణగా ప్రకాష్ రాజ్, అక్తర్ పాత్రలో తేజా కాకుమాను, నఫీసాగా నందినీ రాయ్, నాసిర్ పాత్రలో సందీప్ సాహు, సెల్వ కుమారిగా గాయత్రీ గుప్తా, యు.రాకేష్ పాత్రలో మొయిన్ నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని