close

తాజా వార్తలు

నటుడు సతీశ్‌ రిసెప్షన్‌.. తారల సందడి

చెన్నై: ‘అభినేత్రి’, ‘కత్తి’, ‘రెమో’, ‘నవమన్మథుడు’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సతీశ్‌. తాజాగా ఆయన కోలీవుడ్‌ దర్శకుడు చాచి సోదరి సింధును వివాహం చేసుకున్నారు. ఆయన వివాహ రిసెప్షన్‌ను బుధవారం చెన్నైలో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి, జీవా, శివకార్తికేయన్‌, ఉదయనిధి స్టాలిన్‌, సత్యరాజ్‌తోపాటు పలువురు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఓ తమిళ చిత్రానికి మాటల రచయితగా కూడా సతీశ్‌ వ్యవహరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి సతీశ్‌తో దర్శకుడు చాచికి మంచి స్నేహం ఉంది. తన సోదరి సింధుకు సతీశ్‌ మంచి జోడీ అని భావించిన చాచి ఇరు కుటుంబ పెద్దలకు ఆ విషయాన్ని చెప్పారు. దీనిని అంగీకరించిన ఇరు కుటుంబాల పెద్దలు సతీశ్‌-సింధుకు వివాహాం చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.