యువతకూ మరోసారి కొవిడ్‌ సోకొచ్చు - Scientists Says Corona May Attack Second Time In Youth
close
Updated : 30/04/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువతకూ మరోసారి కొవిడ్‌ సోకొచ్చు

ఒకసారి కరోనా బారిన పడినవారూ టీకా తీసుకోవాలి: ‘లాన్సెట్‌’ అధ్యయనం

దిల్లీ: గతంలో ఒకసారి కొవిడ్‌-19 బారినపడిన యువతకు మరోసారి ఆ మహమ్మారి సోకదన్న భరోసా ఏమీ లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందువల్ల వారు కూడా టీకా పొందాల్సిందేనని స్పష్టంచేశారు. అమెరికాలోని ఐకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. అమెరికా నౌకాదళంలోని మెరీన్‌ కోర్‌ విభాగానికి చెందిన 3వేల మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన నిర్వహించారు. వీరి వయసు 18-20 ఏళ్ల మధ్య ఉంది. అధ్యయనంలో భాగంగా వీరికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి, వారు గతంలో ఎన్నడైనా కొవిడ్‌ బారినపడ్డారా అన్నది నమోదు చేశారు. ఆ తర్వాత వారిని 4 వారాల పాటు వేరుగా ఉంచారు. వీరిలో 189 మంది సీరో పాజిటివ్‌గా తేలారు. అంటే గతంలోనే వీరు ఒకసారి కరోనా బారినపడ్డారు. వారిలో 10% మందికి క్వారంటైన్‌ కాలంలో తిరిగి కొవిడ్‌ సోకింది. సీరో నెగిటివ్‌గా తేలిన వారిలో 45% మందికి కొత్తగా ఇన్‌ఫెక్షన్లు వచ్చినట్లు తేల్చారు.‘‘గత ఇన్‌ఫెక్షన్‌తో భద్రతకు పూచీకత్తు ఉండదు. యువతకూ వైరస్‌ తిరిగి సోకవచ్చు. వారినుంచి అది ఇతరులకు వ్యాప్తి చెందొచ్చు. వ్యాక్సినేషన్‌ ద్వారా అదనపు రక్షణ లభిస్తుంది. అందువల్ల గతంలో కొవిడ్‌ బారినపడిన వారికీ టీకాలు అవసరం’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన స్టువార్ట్‌ సీల్‌ఫాన్‌ చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని