
తాజా వార్తలు
మొత్తానికి శీర్షాసనం వేశాను.. పనికి పదండిక..
సోషల్ లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఈరోజు కూడా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులను పలకరించారు. తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్ జోడీ ‘చైసామ్’ మాల్దీవుల్లో విహరిస్తోండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ‘పనులకు వేళయింది’ అంటూ అందర్నీ మేల్కొలిపే పనిలో పడ్డారు. ఇలా.. ఈరోజు తారలు పంచుకున్న విశేషాలు ఏంటో ఓసారి చూసేద్దాం రండి..
* బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన యోగాసనాల గురించి ఓ పోస్టు చేసింది. శీర్షాసనం వేసేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నానని. మొత్తానికి ఇప్పుడు ఆ ఆసనం వేయగలిగాను అంటూ చెప్పుకొచ్చింది. శరీరం కంటే మనసు బలమైందని ఆమె పేర్కొంది.
* అందం వేరు.. ప్రతిభ వేరు.. అంటూ మరో బాలీవుడ్ నటి వాణీకపూర్ పోస్టు చేసింది. ప్రముఖ అమెరికన్ రచయిత్రి లిసా రాసిన ఓ వాక్యాన్ని ఆమె ప్రస్తావించింది.
* నాగచైతన్య, సమంత జంట మాల్దీవుల్లో హాయిగా విహరిస్తోంది. చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇన్‌స్టా వేదికగా భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సామ్.
* ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌బాబుతో రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ సోఫీ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్‌హాట్ ఫొటోను షేర్ చేసింది.
* హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంకా మాల్దీవుల్లోనే ఉంది. అక్కడ సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న ఆమె ఫొటోల రూపంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది.
* ‘‘మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా భారత్’ అనే కార్యక్రమం గురించి హీరోయిన్ కృతిసనన్ ఓ వీడియో పోస్టు చేసింది. నవంబర్ 25-27 వరకు.. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పింది.
* హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే.
* తాప్సీ తన తర్వాతి సినిమా కోసం చెమటోడుస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ప్రేక్షకులను మెప్పించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బ్యాడ్మింటన్ సాధన సందర్భంగా తీసిన ఓ ఫొటోను ఆమె అభిమానులతో పంచుకుంది.
* నేషనల్ క్రష్ దిశాపటాని తన సోదరికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టు చేసింది.
* ఇక పనికి దేరాల్సిన సమయం ఆసన్నమైంది.. బయలుదేరండంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పోస్టు చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
