నన్ను దేవుడితో పోల్చడం కరెక్ట్‌ కాదు: సోనూసూద్‌ - SonuSood About His Inspiration In Life AND Helping Nature
close
Updated : 16/11/2020 11:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్ను దేవుడితో పోల్చడం కరెక్ట్‌ కాదు: సోనూసూద్‌

వాళ్ల స్ఫూర్తితోనే ఇదంతా చేశా

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వైరస్‌ ధాటికి భయపడి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన వేళ.. వలస కార్మికుల కష్టాలు తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చారు నటుడు సోనూసూద్‌. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీడ్రా’ కార్యక్రమంలో సోనూసూద్‌ నుంచి సాయం పొందిన ఎంతో మంది వ్యక్తులు పాల్గొని తమ బాధలను పంచుకున్నారు. అంతేకాకుండా తమకి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సోనూ‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

కాగా, నటుడు సోనూసూద్‌ సైతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆయన చేసిన సేవల్ని కొనియాడిన రోజా.. ‘ఎంతో మందికి సేవలు చేస్తున్న మీకు స్ఫూర్తి ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘ఈ గొప్పతనం అంతా మా అమ్మానాన్నలదే. మా అమ్మ సరోజ్‌ సూద్‌ వృత్తిరీత్యా ప్రొఫెసర్‌. వృత్తిపరమైన పనుల నిమిత్తం ఆమె ఎన్నో గ్రామాలకు వెళ్తుండేవారు. అక్కడ ఎంతో మంది చిన్నారులను ఆమె చెరదీసేది. వారి పాఠశాల, కళాశాల ఫీజులను అమ్మ చెల్లించేది. మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది.. ‘నిజమైన సక్సెస్‌ అంటే.. ఒకరికి సాయం అవసరమైనప్పుడు వాళ్లు అడగకముందే వెళ్లి సాయం చేయడం’ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దానికి కారణం మా అమ్మానాన్నలే. వాళ్ల స్ఫూర్తే. వాళ్లు ఇప్పుడు నాతో లేకపోవచ్చు. కానీ, నేను చేసే పనులు చూసి.. వాళ్లు గర్విస్తున్నారని ఆశిస్తున్నాను’ అని సోనూ సమాధానమిచ్చారు.

‘రోడ్డు పక్కన ఉన్న వారికి పదిరూపాయలు ఇస్తేనే.. ‘మీరు దేవుడండి అంటారు.’ మీరు ఇంతమందికి సాయం చేశారు. మిమ్మల్ని ఏం అనాలి’ అని శేఖర్‌ మాస్టర్‌ అనగా.. ‘థ్యాంక్యూ శేఖర్‌ మాస్టర్‌. నన్ను దేవుడితో పోల్చడం కరెక్ట్‌ కానే కాదు. నేను కూడా అందరిలాగా సాధారణమైన వ్యక్తినే. కాకపోతే కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు నాకెంతో బాధగా అనిపించేది. వలసకార్మికులు, చదువులు, ఆపరేషన్స్‌.. ఇలా సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని నా వంతుగా ఆదుకొన్నా. నా ప్రాణం ఉన్నంత వరకూ వీలైనంత మంది అండగా ఉంటాను’ అని సోనూసూద్‌ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని