close

తాజా వార్తలు

Published : 29/10/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్కంఠగా సుమంత్‌ ‘కపటధారి’ టీజర్‌

హైదరాబాద్‌: సుమంత్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. నందితశ్వేత కథానాయిక. గురువారం ఈ చిత్ర టీజర్‌ను నటుడు రానా విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికీ ఒక కారణం ఉంటుంది’ అంటూ ప్రారంభమైన టీజర్‌ ఆసక్తికరంగా సాగింది.

ఇందులో సుమంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం రంగంలోకి దిగిన సుమంత్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ మిస్టరీ వెనుక ఎవరు ఉన్నారు? వేషాలు మార్చి కపటధారిగా ఉన్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సిమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ జి.ధనంజయన్‌, లలిత ధనంజయన్‌ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.