మహేశ్‌కు బాలీవుడ్‌ స్టార్‌ ప్రశంస - THIS working still of Ranveer Singh and Mahesh Babu from an advertisement is simply unmissable!
close
Published : 26/12/2020 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌కు బాలీవుడ్‌ స్టార్‌ ప్రశంస

బిగ్‌ బ్రదర్‌ అంటూ పోస్ట్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఉద్దేశిస్తూ బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. మహీతో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా మహీని బిగ్‌ బ్రదర్‌ అంటూ వరుస కలిపారు. తాజాగా ఓ వాణిజ్య ప్రకటన కోసం తొలిసారి వీరిద్దరూ‌ కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రణ్‌వీర్‌‌.. మహేశ్‌తో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘నేను కలిసి పనిచేయాలనుకునే, కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు మహేశ్‌బాబు. మన ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎప్పటికీ విలువైనవే. బిగ్‌ బ్రదర్‌ పట్ల నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి’ అని రణ్‌వీర్‌ వెల్లడించారు.

కాగా, రణ్‌వీర్‌ షేర్‌ చేసిన పోస్ట్‌పై మహేశ్‌ స్పందించారు. ‘బ్రదర్‌ నీతో కలిసి పనిచేయడం నాకెంతో గొప్పగా అనిపించింది. మన ఇద్దరి భావన ఒక్కటే..!’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం మహేశ్‌-రణ్‌వీర్‌ ఫొటో సూపర్‌స్టార్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు మహేశ్‌ ‘సర్కారువారి పాట’ కోసం సిద్ధమవుతున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సూర్యవంశీ’, ‘సర్కస్‌‌’ చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి.

ఇవీ చదవండి

‘ఆ బాక్సులోని బుల్లెట్లు నిజమైనవే’: బిగ్‌ బి

‘నాన్నే నా స్ఫూర్తి’: రణ్‌బీర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని