బ్రిటన్‌లో కరోనా దుస్థితి.. 2020ను మించనుందా? - This is how to avoid 3rd wave of covid in Britain
close
Updated : 29/12/2020 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రిటన్‌లో కరోనా దుస్థితి.. 2020ను మించనుందా?

మూడో దశ కొవిడ్‌ వ్యాప్తి నిరోధించాలంటే..

లండన్‌: వారానికి 20 లక్షల మందికి చొప్పున కొవిడ్‌ టీకా పంపిణీ చేయకపోతే.. బ్రిటన్‌లో మహమ్మారి వ్యాప్తి మూడోదశకు చేరటాన్ని ఆపడం కష్టమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 6.66 కోట్ల జనాభా గల ఈ దేశంలో సోమవారం నాటికి మొత్తం 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 71 వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు.

2020 కంటే దారుణ పరిణామాలు

ఈ నేపథ్యంలో వచ్చే జనవరిలో విద్యాసంస్థలను తెరవకుండా ఉండటం, వారానికి రెండు మిలియన్ల మందికి చొప్పున టీకాను అందజేయటం, దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల అమలు వంటి చర్యలతో మాత్రమే.. పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలమని ‘లండన్‌ స్కూల్‌ ఆప్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. లేని పక్షంలో నూతన సంవత్సరంలో కరోనా కేసులు, మరణాలు 2020ని మించి పోగలవని వారు హెచ్చరిస్తున్నారు.

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా మహమ్మారి.. 70 శాతం అధికంగా వ్యాప్తించగలదని ఆ దేశ‌ ప్రధాని సైతం ప్రకటించారు. వేగంగా దాడిచేస్తున్న దీని లక్షణం హానికరమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌, ఆగ్నేయ ఇంగ్లండ్‌లలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ పంపిణీ బ్రిటన్‌లో ఈ నెల 8 నుంచి ప్రారంభమైంది.  గురువారం నాటికి ఆరు లక్షల మందికి టీకా మొదటి డోసు అందజేసినట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ జనవరి 4 నుంచి ప్రజలకు అందజేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.

ఇవీ చదవండి..

బాలుడిని వెంటాడుతున్న చైనా

కరోనా కంటే పెద్ద మహమ్మారులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని