వ్యాక్సిన్‌ జోరు: యూకేకు భారతీయుల పరుగులు  - Travel agents receive enquiries from Indians keen on going to UK to get COVID-19 vaccine
close
Published : 03/12/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ జోరు: యూకేకు భారతీయుల పరుగులు 

దిల్లీ: కరోనా నివారణ కోసం తయారైన ఫైజర్‌-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం అత్యవసర వినియోగం కింద అనుమతి మంజూరు చేసింది. వచ్చే వారమే ప్రజలకు టీకాలు వేయడాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసింది. దీంతో భారతీయుల చూపు ఇప్పుడు యునైటెడ్‌ కింగడమ్‌(యూకే)పై పడింది. టీకా కోసం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బ్రిటన్‌ వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ట్రావెల్‌ ఏజెన్సీ‌ సంస్థలు తెలిపాయి. వ్యాక్సిన్‌ వార్త వచ్చిన వెంటనే యూకే ప్రయాణాలపై భారతీయుల నుంచి ఎంక్వైరీలు పెరిగాయని పేర్కొన్నాయి. 

వ్యాక్సిన్‌ పొందేందుకు యూకేకు ఎప్పుడు.. ఎలా వెళ్లొచ్చని బుధవారం సాయంత్రం తమను చాలా మంది ఆరా తీశారని ముంబయికి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ తెలిపారు. కాగా.. వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. తొలి ప్రాధాన్యం కింద వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్ల వెల్లడించింది. దీంతో విదేశీయులకు టీకా ఎప్పుడిస్తారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇలాంటి సమయంలో తాము ప్రయాణికులకు ఎలాంటి వివరాలు ఇవ్వలేమని ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంపై యూకే ప్రభుత్వం స్పష్టత ఇస్తే గనుక.. ప్రయాణికుల కోసం తాము ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని అంటున్నాయి. 

వ్యాక్సిన్‌ కోసం ప్రత్యేకంగా యూకేకు వెళ్లాలనుకునేవారి కోసం మూడు రాత్రుల ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించాలని ప్రణాళికలో ఉన్నట్లు ఈస్‌మైట్రిప్‌.కామ్‌ సీఈవో నిశాంత్‌ తెలిపారు. ఇందుకోసం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్ల పేర్కొన్నారు. ఇటీవలే అంతర్జాతీయ ప్రయాణికులకు యూకే ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. విదేశాల నుంచి బ్రిటన్‌ వచ్చిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఆరో రోజు కరోనా పరీక్ష చేసుకున్నాక అందులో నెగటివ్‌ వస్తే ఐసోలేషన్‌ నుంచి బయటకు రావాలని పేర్కొంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ కోసం వెళ్లేవారు అన్ని రోజులు యూకేలోనే ఉండాలో.. అసలు విదేశీయులకు ఇప్పుడప్పుడే టీకా ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

ఇదీ చదవండి..

వచ్చేవారం నుంచి బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్లు మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని