‘డియర్‌ కామ్రేడ్‌’ సరికొత్త రికార్డు - Vijay Deverakonda And Rashmika Set First-Ever Indi
close
Published : 31/08/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డియర్‌ కామ్రేడ్‌’ సరికొత్త రికార్డు

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ-రష్మిక జంటగా నటించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’. గతేడాది జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ మూవీగా మంచి మార్కులే సాధించింది. ‘గీత గోవిందం’ తర్వాత వెండితెరపై విజయ్‌-రష్మిక కెమిస్ట్రీ మరో స్థాయికి వెళ్లింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకత్వం వహించారు.

తాజాగా ‘డియర్‌ కామ్రేడ్‌’ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని ‘గోల్డ్‌మైన్స్‌ టెలిఫిల్మ్స్‌’ ఈ ఏడాది జనవరిలో విడుదల చేయగా, 2 మిలియన్‌ లైక్స్‌తో ఏ భారతీయ చిత్రమూ సాధించని రికార్డును సాధించింది. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ 160మిలియన్ల మంది వీక్షించారు.

మహిళా క్రికెటర్‌గా ఎదగాల్సిన ఓ అమ్మాయి జీవితంలో విపత్కర పరిస్థితులు ఎదురైతే ఆమెను ప్రేమించిన వ్యక్తి ఒక కామ్రేడ్‌లా ఎలా నిలబడ్డాడు? వాటిని ఎలా పరిష్కరించాడు? అనే కథను యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు భరత్‌ కమ్మ. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని