close
Published : 25/01/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫిబ్రవరి 26న వస్తున్న ‘అక్షర’

హైదరాబాద్‌‌: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ సుందరి నందితా శ్వేతా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో పాటు ఒక మంచి సామాజిక సందేశం కూడా ఇస్తుందని దర్శక-నిర్మాతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే.. ఓటీటీలో విడుదల చేసేందుకు ఆఫర్లు వచ్చినా.. థియేటర్లోనే విడుదల చేయాలన్న లక్ష్యంతో అందుకు ఒప్పుకోకుండా.. ఇప్పుడు థియేటర్‌లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వివరించింది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రమని పేర్కొంది. ఈ సినిమాలో సత్య, మధునందన్, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. సురేశ్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు.

ఇదీ చదవండి..

తాండవ్‌: కర్ణిసేన్ చీఫ్‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు
 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని