అక్షయ్‌ మరోసారి అలా కనిపించనున్నారా? - akshay kumar plays dual role in new movie
close
Published : 08/12/2020 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ మరోసారి అలా కనిపించనున్నారా?

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్ర దర్శకుడు జగన్‌ శక్తి దర్శకత్వంలో ఆయనో చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ రెండు పాత్రల్లో కనిపింబోతున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

‘‘మిషన్‌ మంగళ్‌’ తర్వాత శక్తి, అక్షయ్‌ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇది పూర్తిస్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. భారీస్థాయి హంగులతో తెరకెక్కబోతుంది. ఇందులో అక్షయ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు ఎంతో ఆనందకర విషయం’’అని అక్షయ్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో ‘ఆఫ్లాటూన్‌’, ‘జై కిషన్‌’, ‘రౌడీ రాథోడ్‌’ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు అక్షయ్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని