ముద్దుపెట్టలేదని బ్రేకప్‌ చెప్పింది..! - akshay kumar reveals why his first girlfriend rejected him in viral throwback video
close
Published : 21/01/2021 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముద్దుపెట్టలేదని బ్రేకప్‌ చెప్పింది..!

లవ్‌ స్టోరీ గురించి బయటపెట్టిన స్టార్‌ హీరో

వైరల్‌గా మారిన ఒకనాటి వీడియో

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌.. నటి ట్వింకిల్‌ ఖన్నాను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట వివాహ 20వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది కూడా. అయితే, ట్వింకిల్‌ ఖన్నా కంటే ముందు తన జీవితంలో ఓ బ్రేకప్‌ ఉందని ఒకానొక సందర్భంలో అక్షయ్‌ వివరించారు. 2019లో విడుదలైన కామెడీ హంగామా ‘హౌస్‌ఫుల్‌-4’. అక్షయ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం ‘కపిల్‌శర్మ షో’లో పాల్గొంది.

కపిల్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఒకానొక సమయంలో నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అప్పట్లో తనని రెస్టారంట్లు, సినిమాలకు తీసుకువెళ్లేవాడిని. అలా మేమిద్దరం కలిసి నాలుగుసార్లు డేట్‌కు వెళ్లాం. అయితే, అప్పట్లో నాకున్న సిగ్గు కారణంగా నేను ఆమె చేతిని ఒక్కసారిగా కూడా తాకలేదు. అలాగే ముద్దు కూడా పెట్టుకోలేదు. దీంతో ఆ అమ్మాయి.. ఏ విధంగానూ నేను ప్రేమ చూపించడంలేదని నాకు బ్రేకప్ చెప్పేసింది.’ అని అక్షయ్‌ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ మారింది.

ఇదీ చదవండి

వీడియో లీక్‌.. రూ.25 కోట్లు డిమాండ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని