మీడియాకు లీకైతే నా మూవీ ఎవరు చూస్తారన్నారు - alitho saradaga with actress sadha new promo
close
Updated : 26/06/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీడియాకు లీకైతే నా మూవీ ఎవరు చూస్తారన్నారు

హైదరాబాద్‌: ‘అపరిచితుడు’ షూటింగ్‌ జరుగుతుండగా హీరో విక్రమ్‌ తనని చెల్లి అని పిలిచారని, అది చూసి దర్శకుడు శంకర్‌ తీవ్ర నిరాశకు గురయ్యారని సినీ నటి సదా అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే  ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఈసారి కథానాయిక సదా విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ‘అపరిచితుడు’ సినిమా చిత్రీకరణ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. విక్రమ్‌ తనని చెల్లి అని పిలిచేసరికి అది విన్న శంకర్‌ ‘‘మిమ్మల్ని తెరపై రాముడు, సీతలా చూపిద్దామనుకుంటే మీరు ‘అన్నా-చెల్లి’ అనుకుంటూ ఉన్నారు. ఇది కనుక మీడియాకు లీకైతే నా సినిమా చూడటానికి ఎవరూ రారు’’ అని అన్నారని సదా చెప్పుకొచ్చారు.

దర్శకుడు తేజ సినిమా సెట్స్‌లో చాలా క్రమశిక్షణగా ఉంటారని, అలాంటి దర్శకుడిని ఇప్పటివరకూ చూడలేదన్నారు. ఇక అల్లరి నరేశ్‌తో కలిసి చేసిన ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం’ పాట విని ఆ సినిమాకు ఓకే చెప్పానని, అసలు స్క్రిప్ట్‌ కొంచెం కూడా వినలేదని సదా వివరించారు. ఇంకా సదా లెదర్‌ ఉత్పత్తులు ఎందుకు వాడరు? ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎన్టీఆర్‌, బాలకృష్ణలలో సదాకు నచ్చిన క్వాలిటీస్‌ ఏంటి?పెళ్లి అయినా కూడా పిల్లలు వద్దనుకోవడానికి కారణం? ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకున్న సదా ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలు చేయకపోవడం వెనుక ఏం జరిగింది? తెలియాలంటే సోమవారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని