ఏపీలో కరోనా: 9,747 కేసులు.. 67 మరణాలు - andhra pradesh today corona details
close
Updated : 04/08/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కరోనా: 9,747 కేసులు.. 67 మరణాలు

బులిటెన్‌ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,147 నమూనాలను పరీక్షించగా 9,747 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 79,104 మంది చికిత్స పొందుతుండగా.. 95,625 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మరో 67 మంది మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకు 1,604 మంది ప్రాణాలు విడిచారు. 
నేటి వరకు రాష్ట్రంలో 21,75,070 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించిది. కొవిడ్‌ వల్ల ఇవాళ గుంటూరులో 12, కృష్ణాలో తొమ్మది మంది, కర్నూలులో ఎనిమిది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు.. ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని