RRR: భాగ్యనగరానికి బాలీవుడ్‌ బ్యూటీ - bollywood beauty alia bhatt landed in hyderabad
close
Published : 21/07/2021 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: భాగ్యనగరానికి బాలీవుడ్‌ బ్యూటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ భాగ్యనగరంలో ల్యాండ్‌ అయింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సరసన ఆమె సీత పాత్రలో కనిపించనుంది. కాగా.. తన తదుపరి షెడ్యుల్‌లో భాగంగా నగరానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందామె. కారులో ప్రయాణిస్తున్న ఫొటోతో పాటు మేకప్‌రూమ్‌లో తెల్లవారుజామున 6.41గంటలకు క్లిక్‌మనిపించిన ఫొటోలను ఆమె పంచుకుంది. అలియాభట్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఓ పాట రూపొందించనున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఆ పాట చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఒలీవియా మోరీస్‌, కీలకపాత్రల్లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని