WTC Finals: బౌలింగ్‌ దాడిలో వారు ఉండాల్సిందే - bumrah shami can bowl well even on flatter decks says ashish nehra
close
Published : 23/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Finals: బౌలింగ్‌ దాడిలో వారు ఉండాల్సిందే

జడ్డూ, యాష్‌తో టీమ్‌ఇండియాకు అదనపు ప్రయోజనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ పేస్‌ విభాగాలు చాలా బాగున్నాయని టీమ్ఇండియా మాజీ పేసర్‌ ఆశీష్ నెహ్రా అన్నాడు. పిచ్‌, పరిస్థితులను అనుసరించి కోహ్లీసేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. పూర్తిగా పచ్చికతో నిండిన పిచ్‌ రూపొందిస్తే నాలుగో పేసర్‌గా మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం ఉండవచ్చన్నాడు.

‘అవును, రెండు జట్లలో మంచి ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. మన బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి ఫ్లాట్‌ పిచ్‌లపైనా కట్టుదిట్టంగా బంతులు వేయగలరు. వాళ్లే కాదు, ఇషాంత్‌ సైతం ఉన్నాడు. అతడికి వంద టెస్టుల అనుభవం ఉంది. అతడి ఉనికి జట్టును మరింత పటిష్ఠంగా మారుస్తుంది’ అని నెహ్రా అన్నాడు.

‘పిచ్‌పై పచ్చిక ఉంటే అదనపు పేసర్‌ను తీసుకోవడంపై ఆలోచించొచ్చు. ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దొరకొచ్చు. లేదంటే పేసర్లుగా ఇషాంత్‌, బుమ్రా, షమి, స్పిన్నర్లుగా అశ్విన్‌, జడ్డూను తీసుకోవాలి. ఫైనల్స్‌కు ఇంకా నెల రోజులుంది. సాధన చేశాక ఫిట్‌నెస్‌ స్థాయిని బట్టి తుది జట్టును ప్రకటిస్తారు. యాష్‌, జడ్డూను ఆడించడం వల్ల మాత్రం జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. వీరిద్దరూ బ్యాటింగ్‌ చేయగలరు. లోయర్‌ ఆర్డర్‌లో చేసే పరుగులు వెలకట్టలేనివి. ఈ స్పిన్‌ ద్వయం జట్టులో ఉంటే అన్ని విభాగాలూ బాగున్నట్టే’ అని నెహ్రా పేర్కొన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని