సోషల్‌ లుక్‌: రష్మిక ఆమ్లెట్‌.. అనసూయ ట్రీట్‌ - celebrities social media accounts round up
close
Published : 15/10/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: రష్మిక ఆమ్లెట్‌.. అనసూయ ట్రీట్‌

* కథానాయిక రష్మికకు ఆమ్లెట్‌ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజూ తన భోజనంలో అది కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. తన స్టైల్‌లో స్వయంగా ఆమ్లెట్‌ చేసి.. ఇలా ప్రయత్నించండని వీడియో షేర్‌ చేశారు.

* బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ బరువు తగ్గే పనిలో పడ్డారు. ‘తలైవి’ సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగిన ఆమె ఇప్పుడు తగ్గుతున్నట్లు చెప్పారు. ‘మళ్లీ నాజూకుగా తయారు కావాల్సిన అవసరం వచ్చింది.. ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్‌కు వెళ్లా..’ అంటూ వ్యాయామం చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.

* ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోను దర్శకుడు రాధా కృష్ణ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్టని తెలిపారు. కరోనా సమయంలో సినిమా తీయాలంటే టీం వర్క్‌ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

* యాంకర్‌ అనసూయ ‘నవస్త్ర’ అనే సిరీస్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు‌. దీపావళి నేపథ్యంలో అందరికీ వినోదం పంచేందుకు డిజైనర్‌ గౌరీతో కలిసి సిరీస్‌ మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ఫాలోవర్స్‌ను ఈ విధంగా ఎంటర్‌టైన్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో చెప్పారు.

* 24 గంటల్లో హైదరాబాద్‌ నగరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నమ్రత అన్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉందని తెలిపారు. ట్రాఫిక్‌లో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.




















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని