కరోనా ‘మహా’ రికార్డు!  - corona virus update in maharastra
close
Published : 20/03/2021 21:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘మహా’ రికార్డు! 

తొలిసారి 27వేల మార్కు దాటిన ఒక్కరోజు కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ అక్కడ నమోదవుతున్న కేసులు కొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. గత రెండు రోజులూ 25వేల మార్కు దాటిన కొత్త కేసులు.. తాజాగా 27వేల మార్కును దాటేశాయ్‌..! దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో ఒక్కరోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 27,126 కొత్త కేసులు, 92 మరణాలు నమోదు కావడం కలవరపెడుతున్నాయి. అలాగే, ఈ రోజు మరో 13,588 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,82,18,001 శాంపిల్స్‌ పరీక్షించగా.. 24,49,147 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 22,03,553మంది కోలుకోగా.. 53,300 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,91,006 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 62శాతానికి పైగా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు ఉన్న టాప్‌ 5 జిల్లాలుగా పుణె, నాగ్‌పూర్‌, ముంబయి, ఠానే, నాసిక్‌ నిలిచాయి. భారీగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హాజరును 50శాతానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీచేసింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. 

సీఎం తనయుడికి పాజిటివ్‌
మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్‌లు చేయించుకున్నానని, కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆదిత్య పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించి వైరస్‌ వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని