మహారాష్ట్ర, దిల్లీల్లో పగ్గాల్లేని కరోనా!   - covid update in maharastra and delhi
close
Published : 16/04/2021 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర, దిల్లీల్లో పగ్గాల్లేని కరోనా! 

ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం!

ముంబయి/ దిల్లీ: మహారాష్ట్ర, దిల్లీలో కరోనా కల్లోలం మరింతగా ఉద్దృత రూపం దాల్చుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 63,729 కొత్త కేసులు, 398 మరణాలు నమోదు కాగా.. దేశ రాజధాని నగరంలో 19,486 కేసులు, 141 మరణాలు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉన్న కొవిడ్‌ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్‌లు చాలక, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొత్తగా భారీ సంఖ్యలో వస్తున్న కేసులతో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,33,08,878 శాంపిల్స్‌ పరీక్షించగా.. 37,03,584మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 30,04,391మంది కోలుకోగా.. 59,551మంది మరణించారు. ప్రస్తుతం 6,38,034 క్రియాశీల కేసులు ఉన్నాయి. అలాగే, దేశ రాజధాని నగరం దిల్లీలో గత 24గంటల వ్యవధిలో 98,957 శాంపిల్స్‌ పరీక్షించగా.. 19,486 మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలింది. 12,649మంది కోలుకోగా.. 141మంది మృతిచెందారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే దిల్లీలో ఇప్పటివరకు 8,03,623మందికి వైరస్‌ సోకగా.. వారిలో 7,30,825మంది కోలుకున్నారు. 11,793మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దిల్లీలో 61,005 యాక్టివ్‌కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని