దశాబ్దాల వివాదం.. ఒక్క రాత్రితో ముగిసిపోదు - decades of mistrust between pakistan and india situation cant change overnight: army chief naravane
close
Published : 04/06/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దశాబ్దాల వివాదం.. ఒక్క రాత్రితో ముగిసిపోదు

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె

దిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న వివాదం ఒక్క రాత్రిలో ముగిసిపోయేది కాదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె అన్నారు. రక్షణ పరమైన ఏర్పాట్లను సమీక్షించడంలో భాగంగా ఆయన ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ఆపితేనే ఇరు దేశాల మధ్య వివాదాలు తొలగేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యత పూర్తిగా పాకిస్తాన్‌దే అన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు స్వస్తి పలికితేనే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని కొద్ది రోజుల క్రితం నరవణె చెప్పిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా పరిస్థితుల దృష్ట్యా కాల్పుల విరమణ ఒప్పందం ఓ కీలకమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు. రక్షణ సంబంధమైన అంశాల్లో భారత్‌ ప్రాధాన్యాలను పాక్‌ గుర్తించాలన్నారు. సరిహద్దు వెంట యుద్ధ వాతావరణానికి ఆజ్యం పోసే విధానాలను విరమించుకోవాలని దాయాది దేశానికి హితవు పలికారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని