ఎంతమందికి నచ్చిందో! - disha patani most desirable women
close
Published : 30/08/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంతమందికి నచ్చిందో!

ముంబయి: దిశా పటాని తన అందచందాలతో  అభిమానుల మనసు దోచేసింది. ఎంతో మంది తారలను వెనక్కి నెట్టి ‘ది టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ 2019’గా మొదటి స్థానంలో నిలిచింది. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలతో ఈ జాబితాను ప్రకటించింది. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా   నెటిజన్లు ఈ సర్వేలో పాల్గొని తమకు నచ్చిన యాభై మంది మహిళలను ఎన్నుకున్నారు.

దిశా పటాని ఇటీవలే ‘భాఘి 3’, ‘మలంగ్‌’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ... ‘నేను ఫిట్‌గా ఉంటాను. అందుకే అభిమానులు నన్ను మొదటిస్థానంలో నిలబెట్టి ఉండొచ్చు. వాళ్లందరికీ       ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. అంతే కాదు ఇదే చిట్టాలో కత్రినా కైఫ్‌, దీపికా పదుకుణె, కియారా అడ్వానీ, శ్రద్ధా కపూర్‌, యామీ గౌతమ్‌, అదితీ రావు హైదరీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ లాంటి తారలు చోటు దక్కించుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని