గులాబీ రంగు కళ్లు.. జీర్ణాశయ సమస్యలు.. - few more second wave syptoms were observed by scientists and doctors
close
Updated : 17/04/2021 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గులాబీ రంగు కళ్లు.. జీర్ణాశయ సమస్యలు..

రెండో దశలో రూపం, లక్షణాలను మార్చుకున్న మహమ్మారి

దిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మరో విషయాన్ని గుర్తించారు. రెండో దశలో కరోనా వైరస్‌ తన రూపాన్ని, లక్షణాలను మార్చుకున్నట్లు తెలుసుకున్నారు. మొదటి దశతో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో బాధితుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైరస్‌ తీరు మారిందని, లక్షణాల్లోనూ మార్పు కారణంగా వేగంగా వ్యాప్తిచెందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వచ్చేవి. వాసన, రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి కనిపించేవి. అప్పట్లో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా రెండో దశలో మాత్రం వైరస్‌ సోకినవారిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శ్వాస సరిగా ఆడకపోవడం, చికాకు వంటివి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని