అన్నీ అనుకున్నట్టు జరిగితే..టీకా అప్పుడే! - first doses vaccine will likely in late December or early January
close
Updated : 30/10/2020 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నీ అనుకున్నట్టు జరిగితే..టీకా అప్పుడే!

అంచనా వేసిన ఆంటోనీ ఫౌచీ

వాషింగ్టన్‌: అన్నీ అనుకున్నట్లు జరిగితే..అధిక ప్రమాదం పొంచి ఉన్న అమెరికన్లకు డిసెంబర్ చివరినాటికి లేక జనవరి ప్రారంభంలో టీకా లభించే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ఆమోదం కోసం ముందువరసలో ఉన్న మోడెర్నా, ఫైజర్ ఇంక్ సంస్థల తాజా అంచనాల నేపథ్యంలో ట్విటర్, ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో పాల్గొన్న ఆయన ఈ సానుకూల వ్యాఖ్యలు చేశారు. 

‘మనకు సురక్షితమైన, ప్రభావవంతమైన టీకా ఉందా?లేదా? అనే విషయం డిసెంబర్‌లో తెలిసే అవకాశం ఉంది. తుది దశకు సంబంధించిన తాత్కాలిక సమాచారం కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఫౌచీ వెల్లడించారు. మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు జులైలోనే తుది దశ ప్రయోగాలు ప్రారంభించగా..వాటిలో వేల సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. వచ్చే నెలలో వాటికి సంబంధించిన తాత్కాలిక సమాచారాన్ని వెల్లడించనున్నట్లు గురువారం మెడెర్నా వెల్లడించింది. అలాగే అక్టోబర్‌ చివరి నాటికి తమ ట్రయల్స్ వివరాలు వెల్లడిస్తామన్న ఫైజర్ సంస్థ.. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. అమెరికా ఎన్నికలు జరగనున్న నవంబర్ మూడున ఆ సమాచారం ఇవ్వనుందని తెలుస్తోంది.  

ఇదిలా ఉండగా..యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ మొదట ఈ సమాచారాన్ని సమీక్షించి..ట్రయల్స్ విజయవంతం అయితే మొదటి డోసులు ఎవరికివ్వాలో సిఫార్సు చేస్తాయి. అన్ని సక్రమంగా జరిగి డిసెంబర్ చివరి నాటికి, జనవరి ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే ఆ టీకాలను అధిక ప్రమాదం పొంచి ఉన్న వారికి అందిస్తారని ఫౌచీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభావవంతమైన టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కనీసం 2021 చివరి నాటికి కూడా సాధారణ జీవితం తిరిగి రాకపోవచ్చన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని