FabiFlu కేసు: గంభీర్‌ నోట.. భగత్‌సింగ్‌ మాట  - gautam gambhir tweets bhagat singh quote after drug controller accuses him guilty
close
Published : 03/06/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

FabiFlu కేసు: గంభీర్‌ నోట.. భగత్‌సింగ్‌ మాట 

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ అనధికారికంగా కొనుగోలు చేసి పంపిణీ చేసిందని దిల్లీ డ్రగ్‌ కంట్రోలర్‌ అక్కడి హైకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు రావడంతో గౌతీ తనదైన శైలిలో స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌ సూక్తిని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నేను మనిషిని.. మానవాళిపై పడే ప్రభావాలు నాలో ఆందోళనను కలిగిస్తాయి - సర్దార్‌ భగత్‌సింగ్‌’ అని గంభీర్‌ రాసుకొచ్చారు. ఫాబి ఫ్లూ ఔషధం పంపిణీలో తానెలాంటి తప్పు చేయలేదని, అంతేగాక ప్రజల బాగు కోసం తాను చేయాల్సిందంతా చేశానని పరోక్షంగా చెప్పారు.

దిల్లీలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో గౌతమ్‌ గంభీర్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబి ఫ్లూ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడమేగాక, హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్‌ అంత మొత్తంలో ఫాబి ఫ్లూను ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించిన న్యాయస్థానం.. దానిపై విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు దిల్లీ డ్రగ్‌ కంట్రోలర్‌ న్యాయస్థానానికి దర్యాప్తు నివేదిక సమర్పించారు. గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ అనధికారికంగానే ఔషధాలను నిల్వ చేసి పంపిణీ చేసిందని, దీనిపై సత్వర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జులై 29వ తేదీకి వాయిదా వేసింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని