మోహన్‌బాబుతో భేటీపై మోదీ ట్వీట్‌
close
Updated : 06/01/2020 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌బాబుతో భేటీపై మోదీ ట్వీట్‌

దిల్లీ: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ‘మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది మోహన్‌బాబు. మన మధ్య చాలా విషయాలపై మంచి చర్చ జరిగింది. సినిమా ప్రాముఖ్యత, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచవచ్చు అనే అంశాలపై చర్చించాం’’ అంటూ మోదీ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు మోహన్‌బాబు కుటుంబంతో మోదీ కలిసిన ఫొటోను పోస్ట్‌ చేశారు. మోదీతో సమావేశం సందర్భంగా ‘వాట్‌ ఏ మ్యాన్‌!’ అని పేర్కొంటూ ఈ మధ్యాహ్నం మోహన్‌ బాబు చేసిన ట్వీట్‌ను దీనితో ప్రధాని జత చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌ బాబు సమావేశం కావడంపై ఆయన భాజపాలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌ షాను కలిసిన అనంతరం మోహన్‌ బాబు మీడియాతో మాట్లాడారు. అప్పుడు మీడియా ప్రతినిధులు భాజపాలోకి మోదీ మిమ్మల్ని ఆహ్వానించారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం చెప్పలేనంటూ మోహన్‌బాబు దాటవేయడం గమనార్హం. తిరుపతిలోని తమ విద్యాసంస్థలను సందర్శించాలని మోదీని కోరానన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని