ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
close
Updated : 10/06/2020 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, వసుంధరా దేవి, బ్రహ్మణి, నారా లోకేష్‌, తేజస్విని, భరత్, మోక్షజ్ఞ‌ తదితరులు వేడకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య సూపర్‌హిట్‌ సినిమాల్లోని పాత్రలతో బ్యానర్లను రూపొందించారు. ‘వింటేజ్‌ ఎన్బీకే 1960’ థీంతో ప్రత్యేకమైన టీషర్ట్‌లు డిజైన్‌ చేయించారు. వీటిని బ్రహ్మణి, తేజస్విని, నారా లోకేష్, భరత్‌‌ తదితరులు ధరించి సందడి చేశారు. అనంతరం బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఆయన పట్టు పంచెలో కనిపించి.. ఆకట్టుకున్నారు.


బాలకృష్ణకు కేక్‌ తినిపిస్తున్న వసుంధరా దేవికేక్‌ కట్‌ చేస్తున్న బాలకృష్ణబాలకృష్ణ దంపతులకు కానుక అందిస్తున్న చంద్రబాబు దంపతులు.. చిత్రంలో బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌బాలకృష్ణకు కేక్‌ తినిపించి, శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబుతండ్రి బాలకృష్ణకు కేక్ తినిపిస్తున్న మోక్షజ్ఞభార్య వసుంధరాదేవికి కేక్‌ తినిపిస్తున్న బాలకృష్ణ


తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు నివాళి అర్పిస్తున్న బాలకృష్ణ


బసవతారకం ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన బాలకృష్ణ

ఆసుపత్రి సిబ్బందికి అభివాదం చేస్తున్న బాలకృష్ణ


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని