భయం.. ఆజ్ఞానం.. అమాయకత్వం.. విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు - Telugu News Sai Tej Starer Republic Trailer Out Now
close
Updated : 23/09/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయం.. ఆజ్ఞానం.. అమాయకత్వం.. విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు

‘‘జిల్లాకు సుప్రీమ్‌ అథారిటీ కలెక్టర్‌.. నేను ఆ సుప్రీమ్‌ అథారిటీని’’ అంటున్నారు సాయితేజ్‌. ఆయన హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘భగవంతుడి దీవెనలు, ప్రేక్షకాభిమానుల ఆశీస్సులతో సాయితేజ్‌ ఆస్పత్రిలో త్వరగా కోలుకుంటున్నారు. తను త్వరలోనే మన మధ్యకు వస్తాడు. ట్రైలర్‌ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’’ అన్నారు.

ఇక ప్రచార చిత్రం విషయానికొస్తే ‘‘మీ భయం..అజ్ఞానం..అమాయకత్వం...విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు...’’ అని సాయితేజ్‌, ‘‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది’’ అని రమ్యకృష్ణ చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని