హిందీ చిత్రాల విడుదల ఖరారు
close
Updated : 27/09/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిందీ చిత్రాల విడుదల ఖరారు

ఏడాదిన్నరగా స్తబ్దుగా ఉన్న బాలీవుడ్‌ చిత్రసీమలో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే నెల 22 నుంచి పూర్తి సామర్థ్యంతో థియేటర్లు తెరచుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హిందీ చిత్రసీమలో సందడి వాతావరణం నెలకొంది.

క్రిస్మస్‌కు ‘83’..: లెజండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా.. 1983 ప్రపంచ కప్‌ నేపథ్యంతో రూపొందించిన చిత్రం ‘83’. కపిల్‌ పాత్రను బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పోషించారు. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా ఈ  డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.

హిందీ ‘జెర్సీ’ వచ్చేస్తోంది.. : నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’.. ఇప్పుడు బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

వెనక్కి వెళ్లిన ‘లాల్‌ సింగ్‌..’: ఆమిర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. దీన్ని వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.

అక్షయ్‌ జోరు..: వచ్చే ఏడాది బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు వరుస సినిమాలతో సందడి చేయనున్నారు కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ఈ దీపావళికి ‘సూర్యవంశీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన.. కొత్త ఏడాదికి ‘పృథ్విరాజ్‌’ చిత్రంతో స్వాగతం పలకనున్నారు. దీన్ని జనవరి 21న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ‘బచ్చన్‌ పాండే’ మార్చి 4న బాక్సాఫీస్‌ ముందుకు రానుండగా.. మరో సినిమా ‘రామ్‌ సేతు’ను వచ్చే దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.


వీళ్లూ చెప్పేశారు..

* సైఫ్‌ అలీఖాన్‌ ‘బంటీ ఔర్‌ బబ్లీ2’.. 19 నవంబరు 2021

* అహన్‌ శెట్టి ‘తడప్‌’.. 3 డిసెంబరు 2021

* రణ్‌వీర్‌ సింగ్‌ ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’.. 25 ఫిబ్రవరి 2022

* రణ్‌బీర్‌ కపూర్‌ ‘షంషేరా’.. 18 మార్చి 2022

* కార్తీక్‌ ఆర్యన్‌ ‘భూల్‌ భలాయా 2’.. 25 మార్చి 2022

* అజయ్‌ దేవగణ్‌ ‘మేడే’... ఏప్రిల్‌ 29, 2022

* టైగర్‌ ష్రాఫ్‌ ‘హీరో పంటి2’.. 6 మే 2022


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని