బన్నీ నో చెబితే.. విజయ్‌ దేవరకొండ ఓకే అన్నాడు?
close
Published : 19/04/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ నో చెబితే.. విజయ్‌ దేవరకొండ ఓకే అన్నాడు?

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. అయితే దీనికి మొదటి ఛాయిస్‌ విజయ్‌ కాదట. అల్లు అర్జున్‌ను హీరోగా తీసుకోవాలి అనుకున్నారు. కానీ బన్నీకి పూరీ స్క్రిప్టు నరేట్‌ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నో చెప్పినట్లు తెలిసింది. ఆపై కథలో కాస్త మార్పులు చేసి విజయ్ దేవరకొండకు చెప్పినట్లు సమాచారం. ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలా ‘ఫైటర్‌’ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

‘ఫైటర్‌’ సినిమాలో బాలీవుడ్‌ నటి అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌, పూరీ జగన్నాథ్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం విజయ్‌ ఇటీవల ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఇప్పటికే ముంబయిలో 40 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని