స్వర్ణయుగాన్ని చూపిస్తానంటున్న మణిరత్నం!
close
Published : 02/01/2020 21:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వర్ణయుగాన్ని చూపిస్తానంటున్న మణిరత్నం!

చెన్నై: సాధారణ సినిమాను ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలచడంలో సిద్ధహస్తులు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. సినిమా కోసం ఆయన స్క్రిప్ట్‌ మొదలుకొని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పని మొదలు పెడతారు. ప్రస్తుతం ఆయన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అంతేకాదు, ఈ సినిమా కోసం పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను కూడా పంచుకుంది. పులి బొమ్మ ఉన్న ఖడ్గాన్ని పంచుకుంటూ.. ‘‘స్వర్ణయుగపు ఆరంభానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా #పొన్నియన్‌ సెల్వన్‌ షూటింగ్‌ దశలో ఉంది’’ అని చిత్ర బృందం ట్విటర్‌లో పేర్కొంది

చోళుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండోనేషియా, థాయిలాండ్‌లోని కొన్ని లొకేషన్లను మణిరత్నం చూసివచ్చారు. ఇందులో ఐశ్వర్యారాయ్, విక్రమ్, మోహన్‌బాబు, జయం రవి, కీర్తి సురేష్‌ తదితర నటీనటులు నటిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని