అన్న కోసం వస్తోన్న తారక్‌..!
close
Published : 05/01/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్న కోసం వస్తోన్న తారక్‌..!

ఒకేస్టేజ్‌పై సందడి చేయనున్న కల్యాణ్‌రామ్‌-ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: నందమూరి సోదరులు కల్యాణ్‌రామ్‌-ఎన్టీఆర్‌ ఒకేస్టేజ్‌పై సందడి చేయనున్నారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథా చిత్రంలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా మెహారీన్‌ నటించారు. సంక్రాంతి కానుకగా త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఎంత మంచివాడవురా!’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జనవరి 8న నిర్వహించనున్నట్లు చిత్రబృందానికి  ప్రకటించింది. 

అయితే ఈ వేడుకకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో ఓ స్పెషల్‌ పోస్ట్‌ పెట్టింది. దీంతో అన్నదమ్ములను ఒకేసారి స్టేజ్‌పై చూసేందుకు సిద్ధంకండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెషన్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని