రష్మిక ఎక్కడ ఉంటే అక్కడే ఊటీ.. నితిన్‌
close
Published : 31/01/2020 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక ఎక్కడ ఉంటే అక్కడే ఊటీ.. నితిన్‌

మాస్‌ సాంగ్‌తో అదరగొట్టిన ‘భీష్మ’ హీరో, హీరోయిన్‌

హైదరాబాద్‌: రష్మిక అందానికి యువ కథానాయకుడు నితిన్‌ మంత్రముగ్ధుడయ్యారు. అందుకే ఆమె కోసం.. ‘వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ’ అంటూ పాట పాడుతున్నారు. వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘భీష్మ’ నుంచి రెండో పాట.. ‘వాటే బ్యూటీ’ సాంగ్‌ ప్రొమోను శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్‌ వీడియోను ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు రష్మిక సైతం ట్విటర్‌ వేదికగా ఈ సాంగ్‌ ప్రొమోను అభిమానులతో పంచుకున్నారు. ‘సాంగ్‌ ప్రొమో వచ్చేసింది. ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. జానీ మాస్టర్‌ నిజం చెప్పాలంటే మీరు మమ్మల్ని చంపేశారు. నితిన్‌, నేను ఈ పాటకు బాగానే డ్యాన్స్‌ చేశామని భావిస్తున్నాను.’అని రష్మిక పేర్కొన్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని