వాళ్లు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు: ఎన్టీఆర్‌
close
Published : 18/05/2020 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు: ఎన్టీఆర్‌

అభిమానులకు యంగ్‌టైగర్‌ లేఖ

హైదరాబాద్‌: తన పుట్టినరోజు నాడు ఫస్ట్‌లుక్‌ లేదా టీజర్‌ను విడుదల చేయడానికి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం చాలా కష్టపడిందని కథానాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన‌ తన అభిమానులను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని కోరారు. ‘ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నా. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి’.

‘అలాగే, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌లుక్ లేదా టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని నేను అర్థం చేసుకోగలను. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వల్ల అది కుదరలేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ ఎన్టీఆర్‌’ అని లేఖలో పేర్కొన్నారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని