మహేశ్‌, బన్ని అభిమానులకు శుభవార్త
close
Published : 09/01/2020 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌, బన్ని అభిమానులకు శుభవార్త

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ అభిమానులకు శుభవార్త. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అల వైకుంఠపురములో..’  పూజా హెగ్డే కథానాయిక. ఇది జనవరి 12న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ తెల్లవారు జామున 1గంట నుంచి ఉదయం 10గంటల వరకూ రెండు షోలను ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఇక తెలంగాణలోనూ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌కు ఉదయం 7 గంటల నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల స్పెషల్‌ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని